ఉప్పు నీటితో ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా ఎన్నో ప్రయోజనాలు..!
ఉప్పు నీరు ఆరోగ్యానికి, అందానికి కూడా అనేక రకాలుగా ఉపయోగపడుతోంది. అవేంటో తెలుసుకుందాం.
దగ్గు, జలుబు వంటి సమస్యలతో గొంతు నొప్పి ఏర్పడుతుంది. ఈ ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే బ్యాక్టీరియా, అలర్జీలతో ఉప్పు నీరు పోరాడి.. గొంతు నొప్పి సమస్యలను తగ్గిస్తుంది.
చాలా మందికి గోళ్లు పుచ్చుపోయి నొప్పిగా ఉంటుంది. అలాంటి వాటికి కూడా ఉప్పు నీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఉప్పు కలిపిన వేడి నీటిలో కాళ్లు పెట్టి ఉంచితే మంచి ఉపసమనం కలుగుతుంది.
జ్వరం వచ్చినప్పుడు పాత కాలంలో ఓ చిట్కా పాటించేవారు. ఉప్పు కలిపిన చల్లటి నీటిలో గుడ్డని ముంచి శరీరంపై అప్లై చెసేవారు. ఇలా చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గి జ్వరం పోతుందని పెద్దలు చెబుతున్నారు.
కొంత మందికి దంతాలు చాలా సున్నితంగా ఉంటాయి. చల్లని వస్తువులు తినడానికి, తాగడానికి చాలా ఇబ్బంది పెడుతుంటాయి. అలాంటి వాళ్లు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో 2 టీస్ఫూన్ల ఉప్పు కలపి తాగినట్లయితే మంచి ఫలితం ఉంటుంది.
చాలా మంది కాళ్ల మడమలు పగులుతుంటాయి. అలాంటి వారు కొద్దిగా గోరు వెచ్చటి నీటిలో సముద్రపు ఉప్పు కలిపి అందులో పాదాలు 10 నిమిషాలు ఉంచాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
కొంత మందికి అరికాళ్లు బాగా చమటలు పట్టి దుర్వాసన వస్తాయి. అలాంటి వారు ఉప్పు నీటీలో పాదాలు నానబెట్టి తర్వాత చల్లటి నీటితో లేదా ఐస్ క్యూబ్స్‌తో రుద్దాలి. దాని ద్వారా పాదాలు దుర్వసన పోవడమే కాకుండా మృదువుగా అవుతాయి.