ఈ మొక్కతో ప్రాణాంతక వ్యాధులన్నీటికి చెక్ పెట్టవచ్చు..

ప్రస్తుతం టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినప్పటికీ చాలా మంది పలు రకాల చెట్లతో ఆయుర్వేదం చికిత్సను చేయించుకుంటున్నారు.
అందులో ముఖ్యంగా నేలవేము మొక్కతో చాలా ప్రయోజనాలున్నాయి.
అలాగే దీని వల్ల ప్రాణాంతక వ్యాధులు తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
ప్రమాదకరమైన కాన్సర్ రాకుండా ఉండాలంటే నేలవేము ఆకులను నీళ్లలో కాచి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందట.
కొంత మంది వీపరీతమైన బాడీ పెయిన్స్‌తో బాధపడుతుంటారు. అలాంటి వారికి ఈ మొక్కలో ఉండే ఎనాల్జేసిక్ గుణాలు స్వెల్లింగ్, నొప్పులతో పాటు ఐరన్ లోపాన్ని దూరం చేస్తాయి.
నేలవేము మొక్కలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు జ్వరం, గొంతునొప్పి, ఫ్లూ వంటి అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి.
రోజూ మోతాదులో నేలవేము మొక్క ఆకుల రసాన్ని సేవిస్తుంటే లివర్ ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటుంది.
కొంత మంది ఆయిల్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలు వేదిస్తుంటాయి. అలాంటి నేలవేము మొక్క అద్భుతంగా పని చేస్తోంది.
అలాగే నేలవేము చూర్ణం 1 నుండి 2 చెంచాల తీసుకుని నీళ్లలో కలుపుకుని కొన్ని వారాలపాటు తీసుకుంటే మధుమేహం వ్యాధి అదుపులో ఉంటుంది.