సహజంగా దొరికే సీమ చింతకాయలు తింటే ఆరోగ్యానికి మేలు?

సీమచింతకాయలు వేసవిలో సహజసిద్ధంగా దొరుకుతాయి. ఇవి ఎక్కువగా పల్లె టూర్లలో ఉంటాయి.
అయితే వీటిని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
విట‌మిన్ ఎ, విట‌మిన్ బి, విట‌మిన్ సి, మెగ్నీషియం, ఐరన్, కాపర్, ఫాస్పరస్, ప్రోటీన్స్‌, ఫైబ‌ర్‌, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా అనేక పోష‌కాలు నిండి ఉండే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
సీమ చింత‌కాయ‌ల్లో విటమిన్లు అధికంగా ఉండి మెద‌డు ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్ నియంత్రణ‌లో ఉంటుంది.
కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది దంతాలు, ఎముక‌లను దృఢంగా మారుస్తుంది.
విరోచ‌నాల స‌మ‌స్య ఉన్నవారు సీమ చింత‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మంచి ఉపశమనం లభిస్తుంది.
సీమ చింత‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్యలు, అల్సర్లు, మ‌ల‌బద్దకం, మూత్రాశ‌య ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలు దరి చేరకుండా ఉంటాయి.
అధిక బరువుతో బాధపడేవారు ఆ కాయలను తింటే నాజుకుగా తయారవుతారు. అలాగే కంటి చూపు మెరుగ్గా ఉంటుంది.
ఇందులో చక్కెర స్థాయిలు తక్కువగా ఉన్నందున డయాబెటిస్ పేషంట్స్ తింటే ఆరోగ్యానికి మంచిది.