పెర్సిమ్మోన్ పండ్లు తినడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా?

చైనాలో అధికంగా పడ్డించే పెర్సిమ్మోన్ పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి మంచి ఫలితాలు కలుగుతాయి.
ప్రపంచంలోని వెచ్చని ప్రాంతాల్లో వీటిని ఎక్కువగా సాగు చేస్తారు. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి చాలా మంచి చేస్తాయని వైద్యులు చెబుతున్నారు.
ఈ పండులో ఉండే కెరోటినాయిడ్స్, టానిన్లు, ఫీనోలిక్ సమ్మేళనాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉండి గుండె జబ్బులకు చెక్ పెడతాయి.
శరీరంలో మంట, ఒత్తిడిని పెంచకుండా బాడీ అంతా రక్త ప్రసరణ సాఫీగా సాగేలా పెర్సిమ్మోన్ పండ్లు సహాయపడతాయి.
జీర్ణ సమస్యలు, మదుమేహం వంటి అనారోగ్య సమస్యలు వేధిస్తే వీటిని కచ్చితంగా డైట్‌లో చేర్చుకోవాలి.
ఫెర్సిమ్మోన్ పండులో ఫినోలిక్ యాసిడ్లు, టానిన్లు, కాటెచిన్‌ను ఉంటాయి కాబట్టి ఇవి పొత్తి కడుపులో కొవ్వు పేరుకోకుండా నిరోధిస్తాయి. దీంతో బరువు తగ్గుతారు.
ఇవి తింటే రక్తంలో హిమోగ్లోబిన్ పెరగడంతో పాటు కంటి చూపు మెరుగుపడుతుంది.
ఇన్ని ప్రయేజనాలున్న పండ్లు మార్కెట్లలో ఎక్కడ దొరికినా కచ్చితంగా తినాలని డాక్టర్లు సూచిస్తున్నారు.