ప్రతి రోజూ ఉల్లిపాయలు తింటే.. ఏం జరుగుతుందో తెలుసా?

ఉల్లిపాయలు లేకుండా చాలా మంది ఏ వంటకం చేయరు. ఉల్లి చేసే మేలు ఏది చేయదని అందరూ అంటుంటారు.
అయితే ఉల్లిపాయలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.
వీటిలో యాంటీ ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండి రక్తపోటును తగ్గిస్తాయి.
ఉల్లిపాయల్లో ఎక్కువ మొత్తంలో ట్రైగ్లిజరైడ్ ఉంటుంది కాబట్టి అది శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది.
గుండె జబ్బులకు దూరంగా ఉండాలంటే కూడా ఉల్లిపాయలను ఏదో రకంగా తీసుకుంటూ ఉండాలి.
వెల్లుల్లి, ఉల్లిపాయలు వంటి కూరగాయలు కడుపు, పెద్దప్రేగు క్యాన్సర్‌తో సహా కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
ఇందులోని సల్ఫర్ కలిగిన సమ్మేళనం క్యాన్సర్ కణితి అభివృద్ధిని అడ్డుకుంటాయి.
డయాబెటిస్ ఉన్నవారు ఉల్లిపాయ క్రమం తప్పకుండా తినడం అలవాటు చేసుకోవడం మంచిది.
ఫైబర్, ప్రోబయోటిక్స్ ఉండి పలు అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తాయి.