చద్ది అన్నంతో కలిగే ప్రయోజనాలెన్నో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

ఉదయాన్నే తప్పనిసరిగా బ్రేక్ ఫాస్ట్ చేయాలని నిపుణులు చెబుతుంటారు. అయితే చాలా మంది ఇడ్లీ, దోశ, పెసరట్టు వంటి టిఫిన్స్ తింటుంటారు.
అయితే అలాంటి టిఫిన్స్‌తో కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి చద్ది అన్నం తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
చద్ది అన్నం తినడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు.
అలాగే ఇందులో ఉండే పొటాషియం, కాల్షియం, ఐరన్, విటమిన్స్ అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుతాయి.
చద్ది అన్నంలో మజ్జిగ, ఉల్లిపాయ పచ్చి మిరపకాయ నంజుకుని తింటారు కాబట్టి శరీరంలో వేడి తగ్గుతుంది. అలాగే రక్తపోటు నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఇందులో కొందరు అల్లం, కరివేపాకు, జీలకర్ర కలుపుకుని తింటే కడుపుకు సంబంధించిన ఇబ్బందులు రాకుండా ఉంటాయి.
చద్ది అన్నంతో ప్రయోజనాలున్నాయని ఎక్కువ సమయం పాటు ఉండకూడదు. సరైన సమయానికి తినడం వల్లనే ఎముకలు కూడా దృఢంగా మారుతాయి.