కొత్తిమీరను రోజూ తినడం వల్ల శరీరానికి ఏమవుతుందో తెలుసా?

కొత్తిమీర వంటింట్లో ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
మహిళలు కొత్తిమీర లేనిది వంట కూడా చేయకుండా ఉంటారు. అయితే దీన్ని రోజూ తినడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ప్రోటీన్, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, డైటరీ ఫైబర్, విటమిన్ సి, కె వంటి పోషకాలు ఉండి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
ఇందులో ఉండే ప్రోటీన్లు, ఖనిజాలు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించి బరువు తగ్గడానికి సహాయపడుతాయి.
కొత్తిమీరలో ఉండే ఐరన్ రక్తహీనత సమస్య ఉన్నవారికి మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.
గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే కొత్తిమీరను వంటకాల్లో ఉపయోగించి రోజూ తినాలి.
అలాగే ఇటీవల కాలంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య మధుమేహం. దీనిని నియంత్రించడంలో కొత్తిమీర బాగా పని చేస్తుంది.
థైరాయిడ్ ఉన్నవాళ్లు కొత్తిమీరను తింటే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మంచి ఉపశమనం పొందేలా చేస్తాయి.
ప్రయోజనాలున్నాయని మరీ అధికంగా కొత్తిమీరను తినకూడదు. ఎందుకంటే పలు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మితంగా తినడం మంచిది.