బ్రెజిల్ నట్స్ తినడం వల్ల ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలు?

ఆరోగ్యంగా ఉండాలని నిత్యం డ్రై ఫ్రూట్స్ తినడానికి మక్కువ చూపిస్తుంటారు. అయితే వాటితో పాటు బ్రెజిల్ నట్స్ తినడం వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
పనస గింజలను పోలి ఉన్న బ్రెజిల్ నట్స్ మంచి ఫలితాలను ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు.
వీటిల్లో జింక్, ప్రోటీన్, ఖనిజాలు, సెలీనియం, మెగ్నీషియం ఉండి కడుపులో మంటను తగ్గిస్తాయి.
ఇందులో ఉండే ఫైబర్, పొటాషియం, కాల్షియం గుండె జబ్బులు రాకుండా కాపాడుతాయి.
బ్రెజిల్ గింజలను తినడం వల్ల ఎముకలు, కండరాలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటారు.
సెలీనియం చర్మంపై ఉన్న మొటిమలు తగ్గి ముఖం అందంగా తయారవుతుంది.
ఈ గింజల వల్ల ముఖ్యంగా మగవారికి స్పెర్మ్ కౌంట్ పెరిగి సంతానోత్పత్తికి దోహదపడతాయి.
మలబద్దకం సమస్యతో బాధపడేవారు వీటిని తింటే మంచి ఉపశమనం లభిస్తుంది.
అయితే ఈ గింజలను రోజుకు రెండు మాత్రమే తినాలి. లేదంటే జుట్టు రాలడం, అలసట పెరగడం, జీర్ణశయాంతర సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.