పొద్దున్నే పచ్చి కొబ్బరి ముక్క తింటే ఎన్ని ప్రయోజనాలో?
సంవత్సరం పొడవునా కొబ్బరికాయలు మనకు అందుబాటులోనే ఉంటాయి. కాబట్టి వీటిని తినడం ఆరోగ్యానికి మంచిది.
అయితే చాలా మంది ఉదయాన్నే పచ్చి కొబ్బరి తింటే కడుపునొప్పి, దగ్గు, వంటి సమస్యలు వస్తాయని సంకోచిస్తుంటారు.
కానీ, పరగడుపున వారానికి మూడు సార్లు చిన్న పచ్చి కొబ్బరి ముక్కను తింటే శరీరానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి. అలా అని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు.
పచ్చి కొబ్బరిలో ఉన్న కొలెస్టాల్ గుండెకు సంబంధించిన జబ్బులు రాకుండా చేస్తుంది.
దీనిలో ఉండే కీటోజెనిక్ గుణాలు అల్జీమర్స్ వ్యాధి వ్యాపించకుండా చేస్తాయి. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
కొబ్బరి వల్ల చర్మంపై ముడతలు, మచ్చలు తగ్గుతాయి. ఇందులోని ఐరన్ రక్తహీనతను తగ్గిస్తుంది.
ఇందులో ఉండే ఫైబర్ వల్ల జీర్ణ సమస్యలు రావు. మలబద్దకం సమస్యను దూరం చేసుకోవచ్చు.