టీ, కాఫీ తాగే ముందు నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా?

చాలా మంది టీ, కాఫీ తాగేముందు నీళ్లు తాగుతుంటారు.
అలా చేయడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా టీ, కాఫీ తాగే 15 నిమిషాల ముందు నీళ్లు తాగాలి. ఇలా రోజూ చేస్తే ఆరోగ్యంగా ఉండొచ్చు.
టీ, కాఫీతో దంతాలు పాడవుతాయి. అందుకే వీటిని తీసుకునే ముందు నీళ్లు తాగితే పళ్లకు రక్షణ కలిగుతుంది.
అలాగే కొంత మంది పరగడుపున టీ, తాగుతుంటారు. వారికి డీహైడ్రేషన్, ఎసిడిటీ, వంటి సమస్యలు వస్తాయి. వాటికి చెక్ పెట్టాలంటే 15 నిమిషాల ముందు నీళ్లు తాగాల్సిందే.
ఇలా రోజూ టీ, కాఫీ తాగే 15 నిమిషాల ముందు నీళ్లను తాగడం అలవాటు చేసుకున్నట్లైతే పలు అనారోగ్యాల నుండి ఉపశమనం పొందవచ్చు.