చాలా మంది ద్రాక్ష రసం తాగడానికి సంకోచిస్తుంటారు. ఎందుకంటే అది తాగితే మత్తుగా ఉంటుందని అనుకుంటారు.
కానీ దీని వల్ల ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు. దీని తాగితే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.
ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి పుష్కలంగా లభిస్తాయి. చిన్నా పెద్ద ద్రాక్ష రసం తాగడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. పిల్లలు చురుగ్గా ఉంటారట.
ద్రాక్ష రసంలో విటమిన్ సి ఉండడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే పలు ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుకోవచ్చు.
ద్రాక్షలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. దీంతో హార్ట్ ఎటాక్ వంటికి రాకుండా ఉంటుంది.
కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ద్రాక్షరసం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అలాగే అనారోగ్య సమస్యలు రావు.
ఈ రసంలో సహజ ఆమ్లాలు ఉంటాయి కాబట్టి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. దీన్ని తాగడం వల్ల మెదడు ఆక్సీకరణ ఒత్తిడికి గురికాకుండా ఉంటుంది.