వేసవిలో బత్తాయి జ్యూస్ ఎక్కువగా తాగుతున్నారా?

ప్రస్తుతం ఎండలు ప్రజలను భయపెడుతున్నాయి. దీంతో చాలా మంది బయటకు రావడం లేదు. ఒకవేళ వచ్చినా చల్లటి పానీయాలు తాగాలనుకుంటారు.
వేసవిలో చాలా మంది పండ్ల రసాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. వీటిలో బత్తాయి రసం ముఖ్యమైనది దీంతో చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
బత్తాయి‌లో సి విటిమిన్ పుష్కలంగా ఉండి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
అలాగే ఎండకు డీహైడ్రేషన్‌కు గురి కాకుండా ఉండాలంటే ఈ జ్యూస్‌ను కచ్చితంగా తాగాలి. గ్యాస్, అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలను బత్తాయి రసం దూరం చేస్తుంది.
మలబద్దకంతో బాధపడే వాళ్ళు ప్రతిరోజూ భోజనానికి ముందు బత్తాయి రసం తప్పక సేవించాలి.
మూత్ర విసర్జనలో మంట, మూత్రాశయంలో ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలను కూడా దూరం చేస్తుంది.
గర్భిణీలు బత్తాయి జ్యూస్ తాగితే కడుపులో ఉన్న శిశువు పెరుగుదలకు దోహదపడుతుంది.
ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్ ముఖ్యంగా మగవారిలో వీర్యకణాల సంఖ్యను పెంచుతుంది.
చిగుళ్ళ నుంచి రక్తం కారుతుంటే బత్తాయి రసంలో చిటికెడు బ్లాక్ సాల్ట్ కలిపి రక్తం కారే చిగుళ్లపై పోస్తే వెంటనే మంచి ఫలితం ఉంటుంది.
ఆస్తమా ఉన్నవారు బత్తాయి రసంలో జీలకర్ర, అల్లంపొడొ వేసుకుని తాగితే అస్తమా వ్యాధిగ్రస్తులకు వచ్చే దగ్గు తగ్గుతుంది.