ఎండాకాలం వేడిని తట్టుకోలేక చాలా మంది ఫ్రిజ్‌లోని నీళ్లని తాగడానికి ఆసక్తి చూపిస్తారు. కానీ వాటికంటే మట్టి కుండలోని నీటిని తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుందట.
మట్టి పాత్రల్లో వంట చేసుకుని తినడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయని తెలిసిందే. అయితే మట్టి కుండలోని నీరు కూడా మంచి ఫలితాలను కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మట్టి కుండల్లో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉండి నీటి రుచిని పెంచుతాయి.
మట్టి కుండలో నిల్వ చేసిన నీటిని తాగితే శ్వాసకోశ సమస్యలు రాకుండా ఉండటంతో పాటు శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఉంటుంది.
అసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే కుండ నీరును కచ్చితంగా తాగాలి.
వేసవిలో ముఖ్యంగా చర్మ సమస్యలతో బాధపడేవారు కుండ నీటిని తాగితే చర్మం కాంతివంతంగా మారుతుంది.
మట్టి కుండలోని నీరును తాగడం వల్ల వడదెబ్బ తగలకుండా ఉంటుంది. అలాగే గొంతునొప్పి, దగ్గు వంటి వాటి నుంచి రక్షించుకోవచ్చు.
మంటి కుండలో నీళ్లలో మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ ఉండి జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
వేసవి కాలం మొత్తం మట్టి కుండ నీటిని తాగడం వల్ల పలు రకాల వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.