సపోటా ఆరోగ్య ప్రయోజనాల గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

సపోటా పండ్లు చూడటానికి చిన్నగా ఉన్నా అవి మన శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు.
సపోటాల్లో విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, ఐరన్, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.
అందువల్ల సపోటా రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. అంతేకాకుండా కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది.
వీటిల్లో తేనె వేసుకుని తినడం వల్ల పురుషుల్లో టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ పెరుగుతుంది.
ఈ పండ్లను తింటే మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి.
రోజూ సపోటా తినడం వలన జుట్టు సమస్యలు కూడా తగ్గుతాయి