కాగితం పూలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..

కాగితం పువ్వులు సహజ సిద్ధంగా పెరుగుతాయి. ఎక్కువగా పల్లెటూరి వీధుల్లో ఎక్కువగా ఉంటాయి.
అయితే ఇవి పలు రకాల కలర్స్‌తో కూడా ఉంటాయి. వీటితో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
కాగితం పూల చెట్టు నిండా పూలతో ఉన్నప్పుడు చూస్తే మానసిక ఉల్లాసం కలిగి ఒత్తిడి అలసట తగ్గిపోతుంది.
అలాగే జలుబు, దగ్గు ఉన్నవారు. ఈ పువ్వులను నీటిలో వేసి మరిగించి తింటే ఉపశమనం పొందుతారు.
పాదాల, కీళ్ల నొప్పులకు ఈ పువ్వు బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి.
ప్రస్తుతం ఉన్న బిజీ బిజీ జీవితంలో చాలా మంది అధిక రక్తపోటుతో బాధపడుతుంటారు. అలాంటి వారు ఈ పువ్వుతో దానికి చెక్ పెట్టవచ్చు.
కాగితం పువ్వులను నీటీలో ఉడకబెట్టి లేదా రసంగా తయారుచేసుకుని దానితో టీ రెడీ చేసుకుని తాగితే చాలా ప్రయోజనాలు పొందవచ్చు.
ఇప్పుడున్న ఆహార పదార్థాల వల్ల కడుపునొప్పి సమస్య కూడా చాలా మందిని వేధిస్తుంటుంది. అలాంటి వారు కాగితం పూలను ఉపయోగించడం మంచిది.