ఆల్బుకారా పండ్లలో ఉన్న ఔషధాలు శరీరానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?
వర్షాకాలంలో అందుబాటులో ఉండే ఆల్బుకారా పండ్లలో ఉన్న ఉన్న ఔషధాలు శరీరానికి మంచి లాభాలను కలిగిస్తాయి.
ఇవి టమాట ఆకారంలో ఉండి తియ్యని. పుల్లని రుచిని కలిగి ఉంటాయి. ఇవి పలు అనారోగ్య సమస్యలు రాకుండా సహాయపడతాయి.
దీనిలో విటమిన్ ఎ, విటమిన్ బి6, విటమిన్ సి, విటమిన్ డిలతో పాటు ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం వంటి మినరల్స్ అధికంగా ఉండి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
ఆల్బుకారాలో పాలీఫెనాల్ యాంటీఆక్సిడెంట్లు ఉన్నందున క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో ముందుంటాయి.
అలాగే విటమిన్ కె, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్ ఉండి ఎముకలు దృఢంగా ఉండేలా చేస్తాయి.
వీటిలో అడిపోనెక్టిన్ అనే హార్మోన్ ఉంటుంది. మీ రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గించి మధుమేహం వచ్చే ప్రమాదాన్ని అడ్డుకుంటాయి.
క్వెర్సెటిన్, ఆంథోసైనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాకుండా జ్ఞాపకశక్తిని పెంచి అల్జీమర్స్ వ్యాధిని దూరం చేస్తాయి.
ఆల్బుకారా పండ్లలో పుష్కలంగా ఫైబర్ ఉన్నందున మలబద్దకం నుండి ఉపశమనం కలిగిస్తాయి.
అధిక బరువు సమస్యతో బాధపడేవారు వీటిని కచ్చితంగా మీ డైట్‌లో చేర్చుకోవాలి. రోజు తినడం వల్ల నాజుకుగా తయారవుతారు.
ఈ పండ్లు వర్షాకాలంలో వచ్చే పలు ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్లతో పోరాడి మంచి ఫలితాన్ని ఇస్తాయి.