ఎన్నో ఔషధ గుణాలతో కూడుకున్న నల్ల పసుపు పొడిని ఎప్పుడైనా చూశారా?
ఎన్నో ఔషధ గుణాలతో కూడుకున్న పసుపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.
నిత్యం మన ఆహార పదార్థాల్లో వాడే పసుపు ఇన్ ఫెక్షన్లు, వ్యాధులు, అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టడంలో మేలు చేస్తుంది.
అయితే మామూలు పసుపులాగే నల్లపసుపు కూడా ఉందని చాలా మందికి తెలియదు.
నార్మల్ పసుపుతో పోలిస్తే బ్లాక్ టర్మరిక్ తీసుకోవడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ బ్లాక్ టర్మరిక్ లో కర్క్యుమిన్ లెవల్స్ అనేవి అధికంగా ఉంటాయి. ఇది ఆన్ లైన్‌లో అందుబాటులో ఉంటుంది.
యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటే నల్లపసుపు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడుతుంది.
ఫేస్‌పై వచ్చే పింపుల్స్, మచ్చలను, గుల్లల్లాంటి వాటిని తగ్గిస్తుంది. ఇన్‌ఫెక్షన్ వంటి సమస్యలను దరిచేరనివ్వదు.
నార్మల్ పసుపు కంటే యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు మెండుగా ఉన్న నల్ల పసుపే గాయాలను, దెబ్బలను, వాపులను త్వరగా తగ్గిస్తుంది. అర్థరైటీస్ అలాంటి వ్యాధులు కూడా నయం చేస్తుంది.
శ్వాసకోశ సమస్యలు, జలుబు, దగ్గు, ఆస్తమా, ఉబ్బసం తగ్గించడంలో బ్లాక్ టర్మరిక్ ఎంతో సహాయపడుతుంది.
క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షిస్తుంది.