శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీ ఒకటి. కానీ సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల పది మందిలో ఒకరికి మూత్రపిండాల వ్యాధి వస్తుంది. అందుకే కిడ్నీ హెల్త్ కోసం ఈ ఫుడ్స్ తీసుకోండి.
ఆకు కూరలు : మెగ్నీషియం, ఐరన్, కాల్షియం వంటి కీలకమైన ఖనిజాలతో పాటు.. C, B6, B9, K వంటి ముఖ్యమైన విటమిన్లు కలిగిన కాలీఫ్లవర్, క్యాబేజీ, బచ్చలికూర వంటి ఆకు కూరలు మూత్రపిండాల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు అందిస్తాయి.
యాపిల్స్ : యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కలిగిన యాపిల్స్ కిడ్నీలో చెడు బ్యాక్టీరియా పెరగకుండా చేస్తాయి. మూత్రపిండాల సమస్యలు వేగంగా నయం కావడంలో కీలకపాత్ర పోషిస్తాయి.
బెర్రీస్ : యాంటీ ఆక్సిడెంట్స్ కలిగిన క్రాన్ బెర్రీస్ యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్‌ను నిరోధించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఫైబర్‌తో నిండిన బ్లూ బెర్రీస్ కిడ్నీల ఎలాంటి అనారోగ్య సమస్యలకు గురికాకుండా సహాయపడతాయి.
వెల్లుల్లి : రక్తాన్ని శుద్ధి చేసి గుణం కలిగిన వెల్లుల్లి.. కిడ్నీల నుంచి అనవసర వ్యర్థాలను బయటకు వెళ్లేలా సహాయపడుతుంది. వెల్లుల్లిలోని అల్లిసిన్ అనే కీలక సమ్మేళనం CKD వంటి తీవ్రమైన మూత్ర పిండ వ్యాధుల చికిత్సకు ప్రయోజనకరంగా ఉంటుంది.