డయాబెటిస్ పేషెంట్లకు శుభవార్త.. ఈ కూరగాయలతో వ్యాధి మటు మాయం?

డయాబెటిస్ పేషెంట్స్ ముందుగా ఆహారం, నిద్ర విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.
ఈ వ్యాధి బారిన పడిన వారికి రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగిపోతే నరాలు, రక్తనాళాలు దెబ్బతింటాయి. అందుకోసం బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను నియంత్రణలోనే ఉంచుకోవాలి.
కొన్ని రకాల కూరగాయలు మధుమేహాలకు మంచి మేలు చేస్తాయి. అవేంటంటే..?
డయాబెటిస్ పేషెంట్స్ బ్రోకలి కూర తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. దీనిలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ఈ కూరను మీ డైట్‌లో చేర్చకోవచ్చు.
బచ్చలి కూరలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో జీర్ణసమస్యలను, కొవ్వును తగ్గించడం, హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతాయి. ఈ కూర రోజూ తిన్నా ఏం సమస్య ఉండదని నిపుణులు చెబుతున్నారు.
బొప్పాయి జ్యూస్ తాగడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి కంట్రోల్లో ఉంటుంది.
డయాబెటిస్ వారు టమాటా కూర తినడం చాలా వరకు మంచిది. దీనిలో ఔషధ గుణాలు ఉంటాయి. ఇది బరువు తగ్గేందుకు, ఇమ్యూనిటీ పవర్ పెంచేందుకు ఎంతగానో ప్రోత్సహిస్తుంది.
బీట్ రూట్‌‌లో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సీ, విటమిన్ ఏ, కాల్షియం, ఐరన్ వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీని తింటే ఒంట్లో రక్తం పెరగడంతో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. బరువు కూడా తగ్గుతారు.