బంగారం తులం రూ. 1లక్షకు ఎప్పుడు చేరుతుందో తెలుసా?

గోల్డ్ ప్రైస్ గడచిన 6 నెలల నుంచి దాదాపు రూ.10వేలకు పైనే పెరిగింది.
ఈ ఏడాది స్టార్టింగ్‌లో బంగారం ధర రూ.50వేలు ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా 60వేల రూపాయలకు చేరింది.
గడచిన 20 ఏళ్లుగా మనం గమనించినట్లయితే 2003లో గోల్డ్ ఖరీదు రూ. 5వేలు మాత్రమే ఉండేది.
ఈ ఏడాదిలో బంగారం ధర తొలిసారిగా 60 వేల రూపాయలకు పైగా దాటింది. త్వరలోనే ఇది కాస్త లక్షకు చేరడం పెద్ద విషయం ఏం కాదని నిపుణలు అంచనా వేస్తున్నారు.
బంగారం ధర పెరగడానికి ముఖ్యంగా అమెరికా ఒక కారణంగా చెప్పుకుంటున్నారు.
ప్రస్తుతం అమెరికాలో ఆర్థిక సంక్షోభం కారణంగా పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావించి పెద్ద ఎత్తున పెట్టుబడి పెడుతున్నారు.
దీంతో స్పాట్ మార్కెట్‌లో కూడా గోల్డ్ ఖరీదు భారీగా పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈ కారణంగా ప్యూచర్‌లో బంగారం ధర ఈ సంవత్సరం చివరి నాటికి ఒక లక్ష రూపాయలకు చేరుకోవడం ఖాయమని అంటున్నారు.
ఇదే పరిస్థితి కొనసాగినట్లయితే 2024లో గోల్డ్ ధర రూ. 1లక్ష దాటి ఆ పైన కూడా ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.