అమ్మాయిలు ఎక్కువగా అలాంటి అబ్బాయిలనే ప్రేమిస్తారు.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..

ప్రేమ. రెండు అక్షరాలు అయినప్పటికీ ఇందులో చాలా భావోద్వేగాలు, ఎన్నో విఫలాలు, మరెన్నో మరణాలు ఉంటాయి. చాలా మంది సిన్సియర్‌గా ప్రేమించే అబ్బాయిలు, అమ్మాయిలు ఉంటారు. వాళ్లు తమ ప్రేమలోని ఎడబాటును తట్టుకోలేక చనిపోయే వారు కూడా ఉంటారు.
కొంత మంది అయితే.. ఏళ్ల తరబటి ప్రేమిస్తారు కానీ, వారి ప్రేమను వ్యక్త పరిచే ధైర్యం చేయరు. ఇన్ని రకాల ప్రేమలు ఉంటాయి. అయితే.. మీరు గమనించారో లేదో సాధారణంగా అమ్మాయిలు అల్లరి చిల్లరగా తిరిగే అబ్బాయిల ప్రేమలోనే పడతారు. దానికి గల అసలైన కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అమ్మాయిలు చాలా సున్నిత మనస్తత్వం కలవారు. వారికి ఎవరైన వ్యక్తి కొంచెం ధైర్యం ఇచ్చినా, నిజాయితీగా మాట్లాడుతున్నట్లు కనిపించినా చాలా తేలికగా నమ్మేస్తూ ఉంటారు. వాళ్లతో ప్రేమలో పడిపోతుంటారు.
ఇంట్లో ప్రేమ, ఆదరణ నోచుకోని ఆడపిల్లలు బయట వాళ్ళు కాస్తంత ప్రేమ, చొరవ చూపించేసరికి అదే నిజం అనుకొని ఆ అల్లరి చిల్లర వ్యక్తుల ప్రేమలో పడిపోతారు. ముఖ్యంగా స్త్రీలు భద్రతనే కోరుకుంటారు.
అలాగే కొంత మంది నీకు ఏం కానివ్వను అంటూ కలరింగ్ ఇస్తూ ఉంటారు. అది చూసిన అమ్మాయిలు నిజంగానే వీడు తనకి భద్రత ఇస్తాడు అనుకుని తన జీవితాన్ని అంకితం ఇస్తుంది.
ఒక అమ్మాయి సాధారణంగా స్వేచ్ఛని కోరుకుంటుంది. అలాగే అల్లరి చిల్లర అబ్బాయిలు కూడా.. స్వేచ్ఛగా తిరుగుతూ ఉండడం చూసి తనకి ఇంట్లో దొరకని స్వేచ్ఛ ఆ వ్యక్తి దగ్గర దొరుకుతుంది అనుకొని అతనికి దగ్గరవుతుంది.
ఆడపిల్లలు ఏది అడిగినా తల్లిదండ్రులు ఆలోచిస్తారు. కానీ, లవర్లు మాత్రం అమ్మాయి అడగ్గానే ఐఫోన్ కూడా తెచ్చి ఇచ్చేస్తూ ఉంటారు. జీవితాంతం వాళ్లకి ఇలాంటి సర్ప్రైజ్లే ఎక్స్పెక్ట్ చేసిన అమ్మాయిలు వాళ్ళ లవ్ లో ఈజీగా పడిపోతారు.
అయితే.. కొంతవరకు ప్రేమలు సక్సెస్ అయినా చాలా వరకు విఫలం అవుతున్నాయి. కాబట్టి అమ్మాయి, అబ్బాయి ఎరరైనా సరే.. ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. పెద్దలు చెప్పినట్లు వినడం మంచిది.