ఒక నెలలో వచ్చే గ్యాస్ రెండు నెలలు వాడాలా?.అయితే సింపుల్ టిప్స్‌తో గ్యాస్ ఆదా చేయండి!
బియ్యం, పప్పు వంటి కొన్ని ధాన్యాలతో వంట చేసేటప్పుడు ముందు కడిగి నానబెట్టుకోవాలి.
కుక్కర్, పాత్రలు కడిగిన వెంటనే నేరుగా స్టవ్‌పై పెట్టకూడదు. డిష్ వేడెక్కడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి దీని వల్ల గ్యాస్ ఎక్కువ అయిపోతుంది.
ప్రెషర్ కుక్కర్లో వంట చేయడం వల్ల గ్యాస్‌ను సులభంగా ఆదా చేసుకోవచ్చు. ఎక్కువ పీడనంతో ఆవిరి మీద ఆహారాన్ని ఉడికిస్తుంది.
ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్ నుంచి తీసిన వెంటనే గ్యాస్‌పై పెట్టి వేడి చేయవద్దు. అలా చేయడం వల్ల ఆ ఫుడ్ వేడి అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది. దీంతో గ్యాస్ ఎక్కువగా ఖర్చవుతుంది.
అలాగే చిన్న చిన్న పాత్రల్లో వంటలు చేసేటప్పుడు పెద్ద బర్నర్‌ను వాడకండి. మంచిది. ఎందుకంటే మంట చాలా వరకు బయటికి పోతుంది. ఇలా కూడా గ్యాస్ వృథా కావడానికి కారణమే.
ముఖ్యంగా గ్యాస్ బర్నర్‌ను శుభ్రం చేయకపోతే, పైపు ద్వారా గ్యాస్ సరిగ్గా సప్లై కాదు. పైప్‌లో గ్యాస్ బ్లాక్ అయ్యే చాన్స్ ఉంటుంది. కాగా కనీసం 2 వారాలకు ఒక్కసారైనా క్లీన్ చేయడం మంచిది