వర్షాకాలం ఫంగల్ ఇన్ఫెక్షన్ వేధిస్తుందా.. అయితే ఈ చిట్కాలతో చెక్ పెట్టండి?

వర్షాకాలంలో చాలా వరకు ఎక్కువగా చల్లటి నీటిలోనే పని చేయాల్సి వస్తుంది. దీంతో పలు రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
ఎక్కువ నీటిలో నానడం వల్ల కాళ్లు, చేతులకు ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చి చెడటం మొదలవుతాయి. అలాంటి వారు ఈ చిట్కాలు పాటించాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.
వానాకాలం మీ పాదాలను ఫంగల్ ఇన్ఫెక్షన్ నుండి రక్షించుకోవడానికి బయటికి వెళ్లే ముందు మీ పాదాలకు యాంటీ ఫంగల్ లోషన్, క్రీమ్ వంటివి పూయండి.
అలాగే రాత్రిపూట కాళ్ళు శుభ్రంగా కడుక్కుని వేప నూనెను తీసుకొని మెల్లగా మర్దన చేసుకోవాలి.
పల్లె టూర్ లో ఎక్కువగా అందుబాటులో ఉండే గోరింటాకు ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కలిగించడంతో పాటు ఫంగల్ ఇన్ఫెక్షన్‌ను కూడా తగ్గిస్తుంది.
పసుపుతో అనేక అంటువ్యాధులు తగ్గుతాయని అందరికీ తెలిసిందే. కాబట్టి అందులో టీ ట్రీ ఆయిల్ మిక్స్ చేసి చెడిన దగ్గర రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
వర్షాకాలం బూట్లు ధరించకూడదు. బయట నుంచి ఇంటికి వెళ్లిన వెంటనే కాళ్లను సబ్బుతో కడిగితే ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా ఉంటాయి.