చలి నుంచి రక్షించి శరీరాన్ని వెచ్చగా మార్చే ఆహారాలు.. డైట్‌లో చేర్చుకుంటే ఎంతో మేలు!
అప్పుడే పట్నం పల్లే అని తేడా లేకుండా చలి స్టార్ట్ అయింది. పొద్దున్న, సాయంత్రం చలి వల్ల ప్రజలు బయటకు రావడానికి ఎక్కువ ఆసక్తి చూపించడం లేదు.
అలాగే కొందరికి చలికాలం రకరకాల అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుంటారు. అయితే చలి నుంచి రక్షించుకోవడంతోపాటు శరీరం వేడిగా ఉండేందుకు ఈ ఆహార పదార్థాలు తినాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.
ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ అన్ని సీజన్స్‌లో తింటుంటారు. వీటి వల్ల ఆరోగ్యంగా ఉంటారు. అలాగే శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో ఇవి సహాయపడతాయి.
అలాగే మట్టిలో పండించే కూరగాయలు వేర్లు ఉన్నవి డైట్‌లో చేర్చుకోవాలి. బీట్ రూట్, క్యారెట్, ఆకుకూరలు వంటివి తింటే విటమిన్ ఎ, విటమిన్ సి ఉండి ఇమ్మూనిటీని పెంచుతాయి.
కొందరు పొద్దున బ్రేక్ ఫాస్ట్‌గా తీసుకునే ఓట్‌మిల్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిదట. శరీరం కూడా వెచ్చగా ఉంటుంది.
చలికాలం కార్బ్ ఎక్కువగా ఉండే సొరకాయ, బార్లీ వంటి సూప్‌లు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.
తేనెలో ఉండే ఔషధ గుణాల వల్ల పలు సమస్యలను తరిమికొట్టొచ్చు. అలాగే జలుబు, దగ్గు, గొంతు నొప్పిని తగ్గిస్తుంది.
పలు వంటకాల్లో ఉపయోగించే మసాలా దినుసులు చలికాలం శరీరానికి ఎంతో సహాయపడతాయి. అల్లం, నల్ల మిరియాలు, జీలకర్ర, మన శరీరాన్ని వెచ్చగా మార్చి పలు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.