LPG గ్యాస్ సిలిండర్ అయిపోకుండా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలోవ్వండి?

గ్యాస్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి.
గ్యాస్ సిలిండర్ ధరలు గత కొద్ది రోజుల నుంచి స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు మండిపడుతున్నారు.
అయితే కొంత మందికి వంట గ్యాస్‌ తొందరగా అయిపోతుంది. అలా కాకుండా ఎక్కువ రోజులు రావాలంటే ఈ టిప్స్ ఫాలోవ్వండి
అలాగే బర్నర్‌లను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. లేకుంటే మంట సరిగ్గా రాదు గ్యాస్ కూడా వృథా అవుతుంది.
వంట చేసేటప్పుడు గ్యాస్ మీద తడి పాత్రలు పెట్టకూడదు. దానిలో నీళ్లు ఆవిరి అయ్యే వరకు వేడి చేస్తూ ఉంటే ఎక్కువ గ్యాస్ ఖర్చవుతుంది.
ప్రెజర్ కుక్కర్‌లో వంటలను తయారుచేయడం వల్ల తక్కువ సమయంలోనే రుచికరమైన పదార్థాలు తయారవుతాయి. గ్యాస్ కూడా ఆదా చేసుకోవచ్చు.
వంట చేసేటప్పుడు పాత్రలకు మూతపెట్టి వండితే ఆహారంలో పోషకాలు పోకుండా ఉంటాయి. అంతేకాకుండా వంట పూర్తి అయ్యే కొంచెం ముందు గ్యాస్ ఆపేయాలి.
కొన్ని ఆహార పదార్థాలను ఎక్కువ సేపు ఉడికించకూడదు. అలా చేయడం వల్ల గ్యాస్ వృధా అవడంతో పాటు పోషకాలను కోల్పోవాల్సి వస్తుంది.
బర్నర్‌కు సరిపోయేంత పాత్రలను వాడితే మంచిది. లేకుంటే మంట పక్కకు వెళ్లి గ్యాస్ వేస్ట్ అవుతుంది.
అలా కాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించి వంట గ్యాస్‌ను ఆదా చేసుకోండి.