వర్షాకాలంలో మీ పాదాలు పాడవుతున్నాయని చింతిస్తున్నారా..? అయితే ఈ టిప్స్ మీకోసమే..

సాధారణంగా చాలా మంది వర్షపు నీళ్లు పడవు. దీంతో కాళ్లు పాడవుతుంటాయి. ఒరుపులు రావడం, పగలడం వంటివి జరుగుతాయి.
వర్షం కాలంలో పాదాలు పాడవుతున్నాయని ఫీల్ అవుతున్నవారు ఈ చిట్కాల్ పాటిస్తే.. మంచి ఫలితం దక్కుతుంది. ఆ చిట్కాలు ఏంటో చూద్దాం.
రాత్రి పూట నిద్రపోయే ముందు.. పావు కప్పు కొబ్బరి నూనెలో రెండు చుక్కల లవంగ నూనె వేసి పాదాలకు మసాజ్‌ చేయండి. ఇలా రోజూ చేస్తుంటే రక్తప్రసరణ సక్రమంగా జరిగి పాదాలు ఆరోగ్యంగా, మృదువుగా ఉంటాయి
బేకింగ్‌ సోడాలో యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు ఉంటాయి. బకెట్‌లో గోరువెచ్చని నీళ్లు పోసి ఒక స్పూను వంట సోడా, అదే పరిమాణంలో నిమ్మరసం వేసి కలిపి.. పాదాలను ఆ నీటిలో పెట్టాలి. కాసేపటి తర్వాత బయటికి తీసి కాటన్‌ వస్త్రంతో పాదాలు, వేళ్ల సందులను తడి లేకుండా తుడవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే పాదాల దుర్వాసన తగ్గుతుంది.​
వెనిగర్‌ మీ పాదాలను క్లీన్‌ చేయడానికి ఎఫెక్టివ్‌గా పని చేస్తుంది. అరబకెట్‌ గోరువెచ్చని నీటిలో అర మూత వెనిగర్‌ వేయాలి. ఆ నీటిలో పాదాలను కాసేపు ఉంచాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే పాదాలపై మురికి, బ్యాక్టీరియా తొలగుతుంది.
గుప్పెడు గులాబీ రేకలు, రెండు తులసి రెమ్మలు, చెంచా ఆలివ్‌ నూనె నీళ్లల్లో వేసి మరగ బెట్టాలి. గోరువెచ్చగా అయ్యాక కాసేపు అందులో పాదాలను నాననివ్వండి. ఆపై ప్యూమిక్‌ స్టోన్‌తో రుద్దితే మృతచర్మం తొలగి కోమలంగా మారతాయి.
కాళ్ల పగుళ్లు ఉన్నవారికి.. ఈ కాలం మరింత బాధకరంగా ఉంటుంది. కాలి పగుళ్లు బాధించడమే కాదు చూడ్డానికీ బాగోవు. వీటికి ఈ కాలంలో ఫంగస్‌ కూడా చేరితే మరింత ఇబ్బంది. అందుకే యాంటీ మైక్రోబియల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలున్న తేనెను రాత్రి పూట రాసి, కొద్దిసేపయ్యాక కడగాలి. ఇది మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది.