ఏ రోగాలు రాకుండా ఆయుష్షు పెరగాలంటే ఈ చిట్కాలను పాటించాల్సిందే!

ప్రస్తుతం ఆహార అలవాట్ల వల్ల ప్రాణాంతక వ్యాధుల బారినపడి చాలామంది చిన్న వయసులోనే మృతి చెందుతున్నారు. ఈ ఆధునిక కాలంలో 100 ఏళ్లు రోగాలు లేకుండా బతకడం కష్టతరంగా మారింది.
అయితే ఏ అనారోగ్య సమస్యలు రాకుండా బతకాలంటే ఈ సింపుల్ చిట్కాలు పాటించి ఆయుష్షును పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
హెల్దీగా ఉండాలనుకుంటే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్, ఉన్న ఆహారాలను మాత్రమే తినాలి, అలాగే శరీరంలోని విష పదార్థాలు బయటకు పంపాలంటే ఆకుకూరలు నట్స్ వంటివి తింటే మంచిది.
రోజంతా శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండాలంటే రోజులో నీటిని ఎక్కువగా తీసుకోవాలి. దీంతో అనారోగ్యాలకు చెక్ పెట్టవచ్చు.
కొంతమంది ఆరోగ్యంగా అందంగా కనిపించాలని అనుకుంటుంటారు. అలాంటి వారు సూర్యుడి అతినీలలోహిత కిరణాల నుంచి మిమ్మల్ని కాపాడుకోవాలి.
శారీరక శ్రమ తక్కువ కావడంతో పలు అనారోగ్యాలు ఎక్కువైపోయాయి. దీంతో చాలా మంది చనిపోతున్నారు. అలా కాకుండా ఉండాలంటే వాకింగ్, యెగా ఆసనాలు చేయాలి.
ఎక్కువగా రోగాలు రాకుండా ఉండేందుకు ప్రతి విషయానికి ఆందోళన చెంది ఒత్తిడికి గురికాకుండా. ఎందుకంటే వాటి వల్ల వృద్ధాప్య ఛాయలు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
ప్రస్తుతం ఉన్న బిజీ బిజీ జీవితంలో నిద్ర చాలా ముఖ్యం. రోజుకు 8 గంటల నిద్ర లేకుండా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఇటీవల కాలంలో చాలా మంది సిగరెట్, ఆల్కహాల్ కు అలవాటు పడి తొందరగా చనిపోతున్నారు. కాబట్టి వీటిని దూరంగా ఉంటే రోగాలు రావు ఆయుష్షు పెరుగుతుంది.
ఎప్పుడు ఒంటరిగా ఉండి ఎవేవో ఆలోచిస్తే కూడా ప్రమాదంలో పడాల్సి వస్తుంది కాబట్టి ఫ్రెండ్స్‌తో కుటుంబ సభ్యులతో గడపాలి. దీంతో ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటారు.