ఇంట్లోకి దోమలు, పురుగులు రాకుండా ఉండాలంటే.. ఈ సింపుల్ చిట్కాలు ఫాలోవ్వండి?

వర్షాకాలం ఇంటి బయట నీళ్లు నిలువ ఉండటం వల్ల ఈగలు, దోమలు ఇంట్లోకి వస్తాయి. దీంతో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల ముప్పు కూడా గణనీయంగా పెరుగుతుంది.
అయితే అలా ఇంట్లోకి కీటకాలు చొరబడకుండా ఉండాలంటే ఈ సింపుల్ చిట్కాలను పాటించాలి.
ఎంతో నిష్టగా పూజ చేసే తులసి మొక్క దోమలను తరిమి కొట్టేందుకు మంచిగా పని చేస్తోంది. ఇంట్లో తులసి మొక్క ఆకులు ఉంచడం మంచిది.
చీమలు, పురుగులు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే లావెండర్, పుదీనా ఆకుల రసాన్ని మూలల స్ప్రే చేసుకోవాలి. అలా రోజూ చేయడం వల్ల కీటకాలు ఆ ఘాటైన వాసన కి పారిపోతాయి.
అలాగే ప్రతి గాయానికి ఉపశమనం కలిగించడానికి మందుగా పని చేసే పసుపును ఇంటి మూలల్లో గదుల్లో దీన్ని పూస్తే క్రిములు నశిస్తాయి.
ఈ చిట్కాలు పాటించడం వల్ల పురుగులు, కీటకాలు పోవడంతో పాటు అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు.