వర్షాకాలంలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు నివారించడానికి ఈ సింపుల్ చిట్కాలు పాటించండి!

వానకాలం వచ్చేసింది. ఇప్పటినుంచి వర్షాలు పడుతూనే ఉంటాయి.
సాధారణంగా వర్షాకాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. వీటిలో ఫంగల్ ఇన్ఫెక్షన్ ఒకటి. ఈ వ్యాధిని నివారించడానికి కొన్ని చిట్కాలను ఇప్పుడు చూద్దాం..
క్రమం తప్పకుండా స్నానం చేయాలి. ప్రతిరోజూ శుభ్రమైన బట్టలు ధరించాలి.
మీ చేతులను తరచుగా వాష్ చేసుకోవాలి. అలాగే మీ పాదాలను శుభ్రంగా, పొడిగా ఉంచుకోవాలి. మీ పాదాలకు గాలి తగిలేటట్టుగా, ఆరడానికి క్లోజ్డ్-టోన్ షూలకు బదులుగా చెప్పులు లేదా ఓపెన్-టోన్ బూట్లను వేసుకోవాలి.
అంతేకాదు మీ గోర్లను చిన్నగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మీ గోర్ల కింద, చుట్టూ బ్యాక్టీరియా, శిలీంధ్రాలు పెరుగుతాయి.
అలాగే టైట్‌‌గా ఉండే బట్టలను వేసుకోకూడదు. ఇది మీ శరీరంపై తేమ, వేడిని ట్రాప్ చేస్తుంది. దీంతో అక్కడ శిలీంధ్రాలు పెరుగుతాయి. అందుకే ఈ సీజన్ లో వదులుగా ఉండే కాటన్ బట్టలను వేసుకోండి. దీంతో మీ చర్మం పొడిగా, చల్లగా ఉంటుంది.
టవల్స్ లేదా బట్టలు వంటి వ్యక్తిగత వస్తువులను ఇతరులతో షేర్ చేసుకోవద్దు.
వర్షాకాలంలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తే ఓవర్ ది కౌంటర్ యాంటీ ఫంగల్ క్రీములు లేదా స్ప్రేలను యూజ్ చేయండి. కానీ మీకు తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకిందని అనుమానం వస్తే కచ్చితంగా డాక్టర్‌ను సంప్రదించండి.