కాలాలతో సంబంధం లేకుండా వచ్చే సాధారణ వ్యాధి జ్వరం. ఇది వాతావారణంలో మార్పులు వల్ల వస్తుంది.
ఫీవర్ రాగానే ముందుగా ఎవరిరైనా సరే డాక్టర్‌ను సంప్రదిస్తారు.
కానీ కొన్నిసార్లు డాక్టర్లు అందుబాటులో ఉండకపోవచ్చు. అలాంటి సమయాల్లో కొన్ని సులభమైన ఇంట్లో తయారు చేసిన చిట్కాలను పాటించండి
జ్వరం వచ్చినప్పుడు సన్నని బట్టని గానీ, టవల్‌ను గానీ నీటిలో ముంచి శరీర ఉష్ణోగ్రత తగ్గేవరకు నుదుటిపై ఉంచాలి. ఒక స్పూన్ అల్లంను వేడి నీటిలో మరిగించి ప్రతీ 3-4 గంటలకొకసారి తాగండి.
అలాగే ఆపిల్ సైడర్ వెనిగర్ ద్రావణంలో కొన్ని నీళ్లు యాడ్ చేసి, ఆ వాటర్‌ను క్లాత్‌తో నుదురు, కడుపు భాగాన ఉంచితే జ్వరం నుంచి ఉపశమనం పొందచ్చు.
6-7 తాజా తులసి ఆకులను నీటిలో మరిగించి, 3, 4 గంటలకోసారి తీసుకోవాలి.
మరిగించిన పసుపు నీళ్లను తాగడం వల్ల ఫీవర్ నుంచి బయటపడొచ్చు.