ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీలు చేసింది వీరే...

ఐపీఎల్‌లో అత్యంత ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన వారిలో భారత ప్లేయరే టాప్‌లో ఉన్నాడని మీకు తెలుసా..!
కేఎల్ రాహుల్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ సాధించిన మొదటి బ్యాటర్‌గా నిలిచాడు. రాహుల్ పంజాబ్ తరుఫున ఢిల్లీపై 14 బంతుల్లో ఫిఫ్టీ చేశారు.
పాట్ కమ్మిన్స్.. కలకత్తా జట్టు తరఫున ముంబై జట్టుపై కేవలం 14 బంతుల్లో అర్ధ సెంచరీ చేసి ఐపీఎల్ చరిత్రలో రెండవ బ్యాటర్‌గా నిలిచాడు.
యూసుఫ్ పఠాన్.. సీనియర్ ప్లేయర్ అయిన పటాన్ కలకత్తా తరుఫున హైదరాబాద్ జట్టుపై 15 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు.
సునీల్ నరైన్.. కలకత్తా జట్టు తరఫున ఓపెనింగ్ బ్యాటింగ్ చేసి 15 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు. నరైన్ ఈ ఫీట్‌ను RCB జట్టుపై అందుకున్నాడు.
నికోలస్ పూరన్: లక్నో జట్టు.. ఐపీఎల్ 2023లోని 15వ మ్యాచ్‌లో బెంగుళూరు చిన్నిస్వామి స్టేడియంలో.. RCB జట్టుపై పూరన్ కేవలం 15 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు.
ఇషాన్ కిషన్.. ముంబై జట్టు తరఫున.. హైదరాబాద్ పై కిషన్ 17 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు.
క్రిస్ గేల్.. 2013లో పూణే వారియర్స్ జట్టుపై గేల్ 17 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు. అలాగే ఈ మ్యాచ్ లో గేల్ 175 పరుగులు చేయగా ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యధిక స్కోర్‌గా నిలిచింది