కొత్త బట్టలు ఉతకకుండానే వేసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?

ఇటీవల కాలంలో చాలా మంది విచ్చలవిడిగా షాపింగ్స్ చేస్తున్నారు. మహిళలు అయితే ఏ శుభకార్యం లేకపోయినా ఖాళీ సమయం దొరికితే చాలే బట్టలు కొంటుంటారు.
అయితే వాటిని కొన్ని తెచ్చిన తర్వాత కపోర్డ్‌లో పెట్టి ఎక్కడికైనా వెళ్తే అలాగే ధరిస్తారు. అలా చేయడం వల్ల ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చాలా మంది ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారు. అవి వచ్చాక ప్రయత్నించిన తర్వాత ఫిట్టింగ్ సరిగ్గా లేకుంటే, వారు దానిని తిరిగి రిటర్న్ చేస్తుంటారు. అలాంటి దుస్తులు ధరించడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి.
అలాగే కొంత మంది షాపింగ్ మాల్స్‌లో ట్రై చేసిన దుస్తులు అలాగే ఉంచడం వల్ల ట్రయల్ రూమ్ కూడా బ్యాక్టీరియా వ్యాప్తి చెంది పలు అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
కొంత మంది ట్రై చేసిన తర్వాత వాటిని అక్కడే వదిలేసిన వెళ్లిన వాటిని మనకు తెలియక తీసుకుంటే వారి చెమట బట్టలకు అంటుకుని ఉండి మీ శరీరంపై ప్రభావం చూపుతాయి.
బట్టలు తయారు చేసే కంపెనీల్లో మరకలు, రంగులు, మృదువుగా, ముడతలను తొలగించడానికి కొన్ని రసాయనాలను వాడుతారు. ఇవి అనారోగ్యానికి చాలా హానికరం.
కొత్త బట్టలు ఉతకకుండా వేసుకుంటే పిల్లలు, గర్భీణీలకు ఎక్కువగా ప్రమాదం ఉంటుంది.
కాబట్టి కొత్త బట్టలు ఇంటికి తెచ్చుకున్న వెంటనే స్నానం చేసి వాటిని ఉతకాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.