సమయం దొరికినప్పుడల్లా నిద్రపోతున్నారా.. ఈ సమస్యలు వస్తాయి జాగ్రత్త?

ఇప్పుడున్న బిజీ బిజీ లైఫ్‌లో చాలా మంది రాత్రిళ్లు సరిగ్గా నిద్ర పట్టక వివిధ కారణాల వల్ల సమయం దొరికినప్పుడల్లా నిద్ర పోతుంటారు.
రోజుకు 8 గంటలు నిద్ర పోవడం వల్ల అనారోగ్య సమస్యలు రావని నిపుణులు హెచ్చరిస్తుంటారు. అయితే 8 గంటల కంటే ఎక్కువ సేపు నిద్రించడం కూడా అంత మంచి కాదని వైద్యులు చెబుతున్నారు.
అతిగా నిద్రపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి రోజులో కనీసం 8 గంటలు నిద్రను సరిపెట్టుకోవడం మంచిదట.
ఎక్కువ సమయం పాటు నిద్రపోవడం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు పెరగడంతో పాటు అధిక బరువు పెరుగుతారు.
అతిగా నిద్రిస్తే వెన్నునొప్పి, డయాబెటిస్ వంటివి వచ్చే అవకాశం ఉంది.
రోజులో తగినంత సమయం కన్నా ఎక్కువగా నిద్రించడం వల్ల డిప్రెషన్, మానసిక సమస్యలు వంటివి ఎదురవుతాయి.
ఎంత ఎక్కువ నిద్రపోతే అంత అలసట పెరుగుతుంది. దీంతో ఏ పని చేయాలన్నా ఉత్సాహం రాదు. దీంతో బద్ధకం పెరిగిపోయి దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు.
అలాగే అతి నిద్ర వల్ల చిన్న వయస్సులోనే వృద్ధాప్య లక్షణాలు తొందరగా వచ్చి యవ్వనాన్ని కోల్పోవాల్సి వస్తుంది.
కొంత మందికి పలు ఆహార పదార్థాలను తినడం వల్ల సంతానోత్పత్తి తగ్గుతుంది. అయితే దీనికి అతి నిద్ర కూడా ముఖ్యం అని అధ్యయనాలు చెబుతున్నాయి.
కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండాలనుకుంటే అతిగా నిద్ర పోకుండా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడం లేదా ఏదైనా పని చేయడం వంటివి చేయడం మంచిది.