ఈ అలవాట్లు ఉన్నాయా.. అయితే డయాబెటిస్ ప్రమాదం పొంచివున్నట్లే!!
ఇటీవల కాలంలో చిన్న వయసులోనే చాలా మందిని పలు రకాల అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయి అందులో ముఖ్యమైనది మధుమేహం. ఇది రాకుండా ఉండాలంటే కొన్ని అలవాట్లను మానుకోకపోతే చాలా ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా పిండితో చేసే పదార్థాలు అధికంగా తీసుకోవడం అంత మంచిది కాదు. కాబట్టి మధుమేహం రాకుండా కాపాడుకోవాలంటే దూరంగా ఉండాలి.
ప్రస్తుతం చిన్న పెద్ద ఎంతో ఇష్టంగా తినే జంక్ ఫుడ్స్ కొంత మందికి మధుమేహం వచ్చేలా చేస్తాయి.
చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండే కూల్ డ్రింక్స్‌ను తీసుకోకుండా ఉండాలి. లేదంటే ఆరోగ్యానికి హాని కలుగుతుంది.
అలాగే ఏదైనా పని చేస్తున్నప్పుడు ఎక్కువ సమయం పాటు ఒకే చోట కూర్చోకూడదు. అప్పుడప్పుడు లేచి అటు ఇటు తిరగాలి. లేదంటే మధుమేహం వచ్చే అవకాశం ఉంది.