పొరపాటున ఈ పండ్ల గింజలను తిన్నారో ఇక అంతే సంగతులు..!

పండ్లలో ఉండే పోషకాలు, ఫైబర్ ఆరోగ్యానికి మేలు చేస్తాయని అధికంగా తింటుంటారు. ఒక్కోసారి వాటి గింజలను కూడా తినేస్తుంటారు. కానీ, ఈ 5 రకాల పండ్ల గింజలు పాయిజన్ కంటే ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు.
లిచి పండ్ల గింజలో టాక్సిన్ కలిగి ఉంటుంది. అది మానవ శరీరానికి విషంతో సమానం. అలాగే ఇందులో ఉండే ఆమైనో ఆసిడ్స్‌ వల్ల గ్లూకోజ్ లెవల్స్‌పై ప్రభావం పడుతుంది.
ప్లమ్ పండ్ల గింజలను కూడా తినకూడదు. అవి పెద్దగా ఉండి శరీర భాగాల్లో ఇరుక్కుని పలు సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
అన్ని కూరల్లో ఉపయోగించే టమాట గింజలు తింటే కిడ్నీలో రాళ్లు ఉన్నవారికి చాలా ప్రమాదకరం. కాబట్టి దూరంగా ఉండటం మంచిది.
సహజంగా పల్లెటూర్లలో అధికంగా అందుబాటులో ఉండే బొబ్బర్లు పచ్చివి తినకూడదు. వీటిల్లో ఫైటోహెమాగ్గ్లుటినిన్ ఉండి ఎర్ర రక్త కణాలను ఒకదానితో ఒకటి అంటుకునేలా చేస్తుంది. కాబట్టి ఉడికించుకొని మొతాదుకు తినాలి.
అలాగే ఆఫ్రికాట్ పండ్ల గింజలు, చెర్రీ విత్తనాలకు ఎంత దూరం ఉంటే ఆరోగ్యానికి అంత మంచిది.