మీలో ఈ లక్షణాలు కనిపిస్తే మీకు మధుమేహం ఉన్నట్టే.. హెచ్చరిస్తున్న నిపుణులు

ప్రస్తుతం ఉన్న ఆహార పదార్థాల వల్ల వయసుతో సంబంధం లేకుండా అందరికీ డయాబెటిస్ వ్యాధి వస్తుంది.
అయితే డయాబెటిస్ ఎలా వస్తుంది. దానిని గుర్తించేందుకు నిపుణులు కొన్ని లక్షణాలు చెబుతూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
కొంత మందికి భోజనం చేసిన వెంటనే ఆకలేస్తుంది. దీంతో పదే పదే ఏదో ఒకటి తింటుంటారు. ఈ సమస్య అదుపులోకి రాకపోతే మధుమేహం వచ్చినట్టే.
రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిపోయినప్పుడు పలు రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే ఇందులో ముఖ్యంగా కొంత మందికి కాళ్లలో వాపు వచ్చి తిమ్మిరి వస్తుందట. ఇది డయాబెటిస్ లక్షణాల్లో ముఖ్యమైనది.
ఉదయం నిద్రలేచిన వెంటనే మీ కళ్లు పొగమంచుగా లేదా ఎదుటి వ్యక్తి మబ్బుగా కనిపిస్తే షుగర్ లెవల్స్‌ చేక్ చేసుకోవడం మంచిది.
తరచూ కొంత మందికి దాహం వేస్తుంది. ఇది కూడా మదుమేహ లక్షణమే కాబట్టి అలాంటి వారు డాక్టర్లను సంప్రదించాలి.
మూత్రపిండాల భాగంలో నొప్పిగా ఉంటే మధుమేహ సమస్య ప్రమాదం పొంచివున్నట్లేనట. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలట.
రక్తంలో చక్కెర స్థాయి హెచ్చుతగ్గులకు లోనైతే, తరచుగా మూత్ర విసర్జన చేయాలనే కోరిక ఉంటుంది. అలాంటి కచ్చితంగా షుగర్ టెస్ట్ చేసుకోవాలి.
కొంతమంది అది తక్కువ సమయంలోనే బరువు తగ్గుతారు. అలాంటి వారు ఆహార పదార్థాల విషయంలో కొన్ని టిప్స్ పాటించాలట.
ఒక వ్యక్తి రక్తంలో గ్లూకోజ్ స్థాయి హెచ్చుతగ్గులకు గురైనప్పుడు వారికి లైంగిక ఆసక్తి కూడా తగ్గుతుంది. అలా అయ్యే వారికి డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువ.