మోమోస్ టేస్టీగా ఉన్నాయని లాగించేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త?

ప్రస్తుతం చాలా మంది ఇంటి ఫుడ్‌కు దూరమై.. సాయంత్రం వేళల్లో బయటకు జంక్ ఫుడ్‌ మోమెలను లాగించేస్తున్నారు.
స్ట్రీట్ ఫుడ్స్‌లో ఫుల్ పాపులర్ అయిన మోమోస్‌ను చిన్నా పెద్ద ఎంతో ఇష్టంగా తింటున్నారు. అయితే వీటిని తినడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వీటిని మైదాతో తయారు చేస్తారు. కాబట్టి రోజూ తినడం వల్ల షుగర్ పెరిగి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉందట.
అలాగే ఈ పిండిలో ఉండే గ్లూకోజ్ పరిమాణం ఉండి మలబద్ధకం సమస్యను పెంచుతాయి.
వీటిని తినడం వల్ల కొంత మందికి మసాలాలు పడక పలు రకాల అలెర్జీ సమస్యలు కూడా వస్తాయి.
వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో హెచ్చుతగ్గులు మొదలవుతాయి. కాబట్టి దూరంగా మోమోస్‌కు ఉండాలి.
మోమోస్‌లో మోనో-సోడియం గ్లుటామేట్ ఎక్కువగా ఉంటుంది. ఇది నాడీ సంబంధిత రుగ్మతలు, చెమటలు పట్టడం, ఛాతీ నొప్పి వికారం దడ వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమవుతోంది.