ముద్దు పెట్టుకోవడం వల్ల జరిగేది ఇదే.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ప్రస్తుతం ఉన్న జనరేషన్‌లో రిలేషన్‌షిప్‌లో ఉన్నవారు ముద్దులు పెట్టుకోవడం చాలా కామన్ అయిపోయింది.
అయితే ముద్దులు పెట్టుకుంటే భాగస్వామితో బంధం బలపడటంతో పాటు పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయని అధ్యయనాల్లో వెల్లడైందట.
ముద్దు ప్రేమకు సంకేతం. ఇది మెదడును అరోగ్యంగా ఉంచుతుంది. అలాగే ఆక్సిటోసిన్, డోపామైన్, సెరోటోనిన్ అనే హ్యాపీ హార్మోన్లను రిలీజ్ చేసి సంతోషంగా ఉండేలా చేస్తాయి.
ముద్దు పెట్టుకుని కౌగిలించుకోవడం వల్ల కార్టిసాల్ స్థాయిలను, ఒత్తిడి వంటి సమస్యల నుంచి కాపాడుతుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి.
ముద్దు జీవితంలో మధురమైన ఆనందాలలో ఒకటి. అయితే ఇది రక్తపోటును తగ్గిస్తుంది.
తిమ్మిరి వచ్చేవారికి మంచి ఫలితం ఉంటుంది. పీరియడ్స్ సమయంలో ముద్దులు పెట్టుకుంటే నొప్పి, తిమ్మిరి మర్చిపోయేలా చేస్తుందట.
ఇప్పుడున్న బిజీ బిజీ జీవితంలో టెన్షన్ వల్ల తలనొప్పి రావడం కామన్. అలాంటి సమయంలో భాగస్వామిని ముద్దు పెట్టుకుంటే తలనొప్పి తగ్గుతుంది.
ముద్దు పెట్టుకోవడం వల్ల నోటిలో లాలాజల ఉత్పత్తి పెరిగి ఆహారాన్ని మింగడానికి సహాయపడుతుంది.
అలాగే కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచి గుండె జబ్బులు వంటి ఎన్నో వ్యాధులు రాకుండా రక్షిస్తుందట.