శృంగారంలో మహిళల ఆలోచనలు ఇవే..

శృంగారం.. ఈ పదం వినాలన్నా, ఉచ్చరించాలన్నా సిగ్గుపడిపోతారు. అదో బూతు పదంగా ముడుచుకుపోతారు మహిళలు.
కానీ పడక గదిలో మాత్రం ఆకాశమే హద్దుగా రెచ్చిపోతారు. శృంగారంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తారు.
విరహోత్కంఠిత: భర్త చెప్పిన వేళకు రాలేదని.. ఆలస్యానికి తహతహలాడి మనసంతా, రకరకాల ఆలోచనలతో గడిపే స్త్రీ.
ఖండిత నాయిక: తన భర్త రాత్రంతా పర స్త్రీతో గడిపి, తెల్లవారాక రతి చిహ్నాలతో ఇంటికి వచ్చిన మగాడిని చూసి దుఃఖించే స్త్రీ.
స్వాధీన పతిక : తను చెప్పినట్లు విని, తను కోరినట్లు నడుచుకునే భర్త గల స్త్రీ
ప్రోషిత పతిక: భర్త తనకు దూరంలో ఉన్నప్పుడు అతని తలపులను మనసున నెమరు వేసుకుంటూ విరహవేదన పడే స్త్రీ.
వాసక సజ్జిత: దూరాన ఉన్న భర్త చాలాకాలం తరువాత వస్తున్నాడని తెలిసి విరహ వేదనతో అందంగా ముస్తాబై, తన పడక గదిని అలంకరించి ఎదురు చూసే స్త్రీ.
విప్రలబ్ధ: తాము ఏర్పాటు చేసుకున్న సంకేత స్థలానికి తన ప్రియుడు రానిపక్షంలో విరహంతో బాధపడే స్త్రీ.
కలహాంతరిత : భర్త ఎంత చెప్పినను వినక అది అబద్ధమని వాదించి, అతనితో దెబ్బలాడి వెళ్లగొట్టి.. తరువాత అయ్యో ఎంత పనిచేసాను..ఎంత నొచ్చు కున్నాడో.. అని దిగాలు పడే స్త్రీ.
అభిసారిక: అందంగా అలంకరించుకొని ప్రియుడి దగ్గరకు తానే వెళ్ళేది లేదా ప్రియుడిని తన దగ్గరకే పిలిపించుకునే స్త్రీ.