ఈ పదార్థాలను తినడం వల్ల డయాబెటిస్ ముప్పు తప్పదు.. అవేంటంటే?

ప్రస్తుతం ఉన్న ఆహార పదార్థాలను తినడం వల్ల చాలా మంది మధుమేహం బారిన పడుతున్నారు.
అలాగే కొంత మందికి జన్యుపరంగా వారి ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
అయితే డయాబెటిస్ రావడానికి గల కారణం కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్న డోనట్స్, మిఠాయిలు, తియ్యని తృణధాన్యాలు తీసుకుంటే బరువు విపరీతంగా పెరుగుతారు. అంతేకాకుండా ఇవి ఇన్సులిన్ నిరోధకతకు కూడా దారితీస్తుంది.
వైట్ బ్రెడ్, పాస్తా వంటివి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. దీంతో డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువ.
ఫైబర్ లేని ఆహారాలను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి మధుమేహం వస్తుంది. కాబట్టి ఫైబర్ పుష్కలంగా ఉండే పండ్లు, కూరగాయలను తీసుకోవడం మంచిది.
నెయ్యిలో ఎక్కువగా వేయించిన ఆహారాలలో అధిక కొవ్వును కలిగి ఉంటాయి. ఈ లిపిడ్ వల్ల ఊబకాయం ఇన్సులిన్ నిరోధకత ఏర్పడి డయాబెటిస్ వస్తుంది.
కొంత మంది ఏది పడితే అది ఎక్కువగా తింటుంటారు. అలా తినడం వల్ల బరువు పెరిగి ఊబకాయం బారిన పడతారు. ఇది డయాబెటిస్‌కు ముఖ్యమైన కారకం.
రక్తంలో చక్కెర స్థాయిలలో హెచ్చు తగ్గులు రావడానికి భోజనాన్ని స్కిప్ చేయడం కూడా ఒక కారణమని వైద్యులు చెబుతున్నారు. కాబ్టట్టి టైమ్‌కు తిని ఆరోగ్యంగా ఉండండి.
సాయంత్రం వేళ్లలో చాలా మంది ఫాస్ట్ ఫుడ్స్‌ను తింటారు. అలా తింటే అనారోగ్య సమస్యలతో పాటు డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకంటే వీటిలో అనారోగ్యకరమైన కొవ్వులు, అదనపు చక్కెరలు, సోడియంలు ఎక్కువగా ఉంటాయి.