టిఫిన్స్‌కు బదులు ఖాళీ కడుపుతో ఈ పండ్లు తీసుకుంటే.. ఆరోగ్యంగా ఉండటం ఖాయమట!

చాలామంది ఇప్పుడు ఇడ్లీ, వడ, దోశ, ఉప్మా, పూరి, బోండా, పెసరట్టు వంటి టిఫిన్స్‌ను ఎంతో ఇష్టంగా తింటుంటారు. కానీ వీటిని తినడం వల్ల పలు అనారోగ్య సమస్యలు వస్తాయి.
అయితే అలాంటివి కాకుండా పోషకాలు నిండి ఉన్న కొన్ని రకాల పండ్లు ఉదయం పూట తీసుకోవడం వల్ల శరీరానికి మంచి లాభాలు కలుగుతాయి. అవెంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఆపిల్ పండ్లలో ఫైబర్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, వంటివి ఎక్కువగా ఉంటాయి, కాబట్టి వాటిని తింటే మంచిది.
అలాగే కమలా పండులో ఉండే సి విటమిన్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో పొటాషియం, ఫోలేట్‌లు మన శరీర ఆరోగ్యం మెరుగవడానికి సహకరిస్తాయి.
మామిడి పండ్లలో విటమిన్లు పీచు పదార్థాలు ఉండి కొన్ని అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
బొప్పాయిలోనూ విటమిన్‌ సి, పొటాషియం, ఫైబర్‌లు పుష్కలంగా ఉంటాయి. లైకోపీన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ క్యాన్సర్‌తో పోరాడుతుంది.
పియర్ పండును చాలామంది తినడానికి ఎక్కువగా ఇష్టపడరు. కానీ, దాన్ని ఉదయం పూట తింటే మంచి ఫలితాలు కలుగుతాయి.
ఏ కాలంలో అయినా లభించే పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే మార్నింగ్ తినే ఆహారంలో దీనిని చేర్చుకోవడం లాభకరం.
ప్రతి రోజూ తినే అరటి పండును కూడా పొద్దున తినే అల్పాహారంలో కలుపుకుని తీసుకుంటే చాలా మంచిది.