మన ఇంట్లో రెగ్యులర్‌గా వాడే పదార్థం చింతపండు. రసం, సాంబార్, పులిహోర ఇలా వంటంకం ఏదైనా మాక్సిమమ్ చింత పండు వాడుతాం.
చింతపండు ఉపయోగించడం వల్ల ఆహారం రుచి పెరిగినట్లే.. దీనిని తినడం కారణంగా కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు.
చింతపండులో ఫైబర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతే కాకుండా ఇందులో ఉండే ఫైటో కెమికల్స్ ఆరోగ్యానికి అనే రకాలుగా మేలు చేస్తాయి.
అయితే.. చింతపండు ఎక్కువగా తినడం వల్ల రక్తం గడ్డకడుతుందని అంటారు. కానీ నిజానికి చింతపండు రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ని గ్రహిస్తుందట.
చింతపండులో ఉండే శ్లేష్మం, పెక్టిన్, అరబినోస్ జీర్ణమయ్యే ప్రక్రియను వేగంగా చేస్తాయి. దీంతో మలబద్ధక సమస్యని తగ్గుతుంది. అంతు కాకుండా పేగులో హెల్దీ బ్యాక్టీరియా ఉత్పత్తిని పెంచుతుంది.
చింతపండులో ఉండే టార్టారిక్ ఆమ్లం మనం తినే కూరగాయలు, ఇతర ఆహారాల నుంచి ఐరన్ గ్రహించడంలో సాహాయపడుతుంది.
చింతపండులో ఉండే కొన్ని ఫినాలిక్ అణువులు మన శరీరంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను పెంచి.. వాపులను నివారించడానికి ఉపయోగపడతాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండి.. షుగర్‌ని కంట్రోల్ చేయడానికి, లివర్ సమస్యల్ని తగ్గించేందుకు సాయపడుతుంది.
చింతపండు మాత్రమే కాదు.. దీని గింజల్లో కూడా ఎన్నో ఔషధగుణాలు ఉన్నాయి. ఇందులోని కొన్ని పదార్థాలు క్యాన్సర్‌ని తగ్గించడంలో, గుండె పనితీరుని మెరుగుపరచడంలో, ఆర్థరైటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో సాయపడతాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
నోట్: పైన తెలిపిన సమాచారం నిపుణులు, అధ్యయనాలు, ఇంటర్నెట్ ఆధారంగా తెలిపినవి మాత్రమే. ఆరోగ్యానికి, శరీరానికి సంబంధించి ఎటువంటి సమస్య వచ్చిన వెంటనే వైద్యుడుని సంప్రదించడం మంచిది.