ఎర్ర కారం తింటున్నారా? అయితే తప్పక ఈ విషయాల్ని తెలుకోండి?

కొంతమంది ఎండుకారం తినడానికి ఎక్కువగా ఇష్టపడుతారు. మరికొందరు ఇష్టపడరు.
కానీ ఎండుకారం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని, తగినంత మోతాదులో కారాన్ని తప్పకుండా ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
వంటల్లో కారం వేయడం వల్ల రుచికరంగా ఉండటమే కాకుండా కారంలో ఉండే సమ్మేళనాలు జీర్ణ సమస్యలను తగ్గిస్తాయని ఇటీవల పరిశోధనలో వెల్లడైంది.
అలాగే బ్లెడ్ సర్కిలేషన్ సరిగ్గా ఉంటుంది. అలాగే గుండె సమస్యలు, కీళ్లనొప్పులు రాకుండా మేలు చేస్తుంది.
తలనొప్పి ఉన్నవారు కారం అధికంగా తీసుకున్నట్లైతే తొందరగా ఉపశమనం కలుగుతుంది.
దగ్గు, జలుబు తగ్గుతాయి. ఆకలిని తగ్గిస్తుంది.
మిరపలో ఎక్కువ మొత్తంలో పొటాషియం ఉండడం వల్ల రక్త నాళాలను రిలాక్స్‌గా ఉంచుతాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ రాకుండా రక్షిస్తుంది.
ఎండు మిరపకాయ శరీరంలోని జీర్ణక్రియ రేటును పెంచడం వల్ల అదనపు కొవ్వు కరిగిపోతుంది.