బ్లాక్ బాక్సుల్లో బిర్యానీ తింటున్నారా? అయితే క్యాన్సర్ ముప్పు తప్పదు..!

వీకెండ్ వచ్చిందంటే చాలు యూత్ ఎక్కువగా బిర్యానీలు ఆర్డర్ పెట్టుకుని లాగేస్తుంటారు.
మనం ఆర్డర్ చేసినప్పుడు బిర్యానీ ఒక బ్లాక్ బాక్స్‌లో మన గుమ్మం ముందుకు వచ్చేస్తుంది. కస్టమర్లు ఏమి ఆలోచించకుండా తినేస్తారు.
అయితే ఆ బాక్స్‌లో వచ్చిన బిర్యానీ తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి.
బ్లాక్ ప్లాస్టిక్‌ను రీసైకిల్ చేయడం కష్టం. ప్లాస్టిక్ రెసిన్లకు కార్బన్ బ్లాక్ పిగ్మెంట్ జోడించడం ద్వారా దీనిని తయారు చేస్తారు. ప్లాస్టిక్‌లో బ్లాక్ ప్లాస్టిక్ చాలా డేంజరస్. దీని వల్ల పర్యావరణ కాలుష్యం కూడా పెరిగే అవకాశం ఉంది.
కార్బన్ బ్లాక్ ప్లాస్టిక్‌లో PAH అంటే పాలీసైక్లిక్ హైడ్రోకార్బన్ ఉంటుందట. దీనివల్ల కాన్సర్ మాత్రమే కాదు.. చాలా సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందట. ఈ ప్లాస్టిక్ బాక్సులలో బిస్ ఫినాల్-ఎ, థాలేట్స్ వంటి కొన్ని రసాయనాలు ఉన్నాయని, అవి అందులో ప్యాక్ చేసిన ఆహారంతో కలిసిపోతాయని అనేక అధ్యయనాలలో వెల్లడించారు.
కాబట్టి ప్లాస్టిక్ వస్తువులు యూజ్ చేసే ముందు ఒకసారి మీ ఆరోగ్యం గురించి ఆలోచించండి.