కంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఇది తినాల్సిందే..

ప్రస్తుతం కాలంలో ఉన్న పొల్యూషన్ కారణంగా పెద్దా చిన్నా అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరికి కంటి సమస్యలు వస్తున్నాయి.
అలా కంటి సమస్యలు రాకుండా ఉండాలంటే క్యారెట్లు తీసుకోవాలి.
సాధారణంగా విటమిన్ ఎ లోపం వల్ల డ్రై ఐ అనే వ్యాధి వస్తుంది. ఇది సాధారణంగా దృష్టి లోపానికి కారణం అవుతుంది.
క్యారెట్ల్‌లొ విటమిన్ ఎ, బీటా కెరోటిన్, విటమిన్ సి, లుటిన్, జియాక్సంతిన్ పుష్కలంగా ఉంటాయి.
కాబట్టి క్యారెట్ రోజు తీసుకోవడం వల్ల మన కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.
వారానికి రెండుసార్లు కంటే ఎక్కువసార్లు క్యారెట్లను తిన్న మహిళలు క్యారెట్లు తినని మహిళల కంటే గ్లాకోమా వచ్చే ప్రమాదం 64% తక్కువగా ఉందని అమెరికన్ జర్నల్ ఆఫ్ ఆప్తాల్మాలజీ కనుగొన్నది.
క్యారెట్లు కంటి ఆరోగ్యానికే కాదు.. అనారోగాలు రాకుండా ఉండేందుకు కూడా ఉపయోగపడుతాయి.