ఈ ఐదు కారణాల వల్లే మగవారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది

స్మెర్మ్ అనేది పురుష పునరుత్పత్తి కణం. ఇది పురుషుల నుంచి వచ్చే వీర్యంలోనే స్మెర్మ ఉంటుంది. దీన్నీ మినియన్లలో లెక్కిస్తారు.
సాధారణంగా ఒక ఆరోగ్యకరమైన వ్యక్తిలోని ఒక మిల్లీలీటర్ వీర్యంలో దాదాపు 40 నుంచి 300 మిలియన్ల స్పెర్మ్ ఉంటుంది.
కానీ, అనేక కారణాల చేత మగవారిలో ఈ సెర్మ్ కౌంట్ అనేది తగ్గిపోయి.. సంతానలేమి సమస్యలు ఎక్కువగా నమోదవుతున్నాయి. వేటి వల్ల సెర్మ్ కౌంట్ తగ్గిపోతుందో తెలుసుకుందాం..
పునరుత్పత్తి ప్రక్రియలో వయస్సు కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే వయసుతో పాటు సెర్మ్ నాణ్యత, పరిమాణం క్షీణిస్తుంది. దీంతో వయసు పెరిగే కొద్ది సెర్మ్ కౌంట్, నాణ్యత, మోర్టాలిటీ తగ్గడం జరుగుతాయి. కాబట్టి ఎక్కువ వయసులో పిల్లలు కావాలను కుంటే కలగకపోవచ్చు.. లేదంటే పిల్లలకు మానసిక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.
ఈ మధ్యకాలంలో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు సిగరెట్లకు, మద్యానికి, డ్రగ్స్‌కు అలవాటుపడుతున్నారు. ఈ అలవాట్ల కారణంగా శరీరంలో కాడ్మియం స్థాయి పెరిగి.. స్పెర్మ్ DNAను దెబ్బతిస్తాయి. ఈ మత్తుపదార్థాలు స్పెర్మ్ కౌంట్, నాణ్యతను తగ్గిండమే కాకుండా.. సెమినల్ ఫ్లూయిడ్ ఉత్పత్తిని, పురుషాంగానికి రక్త సరఫరాను కూడా తగ్గిస్తాయి.
ప్రస్తుతం అందరూ బిజీ లైఫ్‌ను లీడ్ చేస్తున్నారు. దీంతో అధిక ఒత్తిడికి గురవుతున్నారు. అధిక ఒత్తిడి కూడా స్పెర్మ్ కౌంట్‌ను తగ్గిస్తుంది.
బాడీబిల్డింగ్ సప్లిమెంట్స్‌లో కండర ద్రవ్యరాశిని పెంచే అనాబాలిక్ స్టెరాయిడ్‌లు ఉంటాయి. ఇవి వృషణాలను కుదించి, స్పెర్మ్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. అంతే కాకుండా వంధ్యత్వానికి దారితీసే స్పెర్మ్ నాణ్యతను తగ్గిస్తాయి.
పర్యావరణ పరిస్థితులు కూడా స్పెర్మ్ కౌంట్‌ను ప్రభావితం చేస్తాయి. మానవ వృషణాలు శరీర ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 4 డిగ్రీలు చల్లగా ఉంటే తప్ప స్పెర్మ్‌ను ఉత్పత్తి చేయలేవు. కాబట్టి.. అధిక వేడి ఆరోగ్యకరమైన స్పెర్మ్‌కు హాన కలిగిస్తుంది.
ముఖ్యంగా రేడియేషన్స్ కూడా స్పెర్మ్ కౌంట్‌ను ప్రభావితం చేస్తాయి. చాలా మంది ప్యాంటు జేబులో సెల్ ఫోన్‌లు వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను పెట్టుకోవడం మానుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు.
నోట్: పైన తెలిపిన అంశాలు ఇంటర్నెట్, నిపుణులు చెప్పిన దాని ప్రకారం సూచించినవి మాత్రమే. ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.