ఎండలను తట్టుకునేందుకు చాలా మంది నిమ్మ రసాన్ని ఎక్కువగా సేవిస్తుంటారు.

నిమ్మరసం తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నప్పటికీ ఎక్కువగా తాగితే పలు రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
నిమ్మకాయలో ఆమ్ల స్వభావం కలిగి ఉండటం వల్ల లెమన్ వాటర్ తాగితే దంతాలపై ఉన్న ఎనామికల్ దెబ్బతిని దంత సమస్యలు వస్తాయి.
లెమన్ వాటర్‌ను ఉదయాన్నే సేవించడం వల్ల గుండెల్లో మంట వస్తుంది.
అలాగే జీర్ణ సమస్యలు ఉన్నవారు లెమన్ వాటర్ అధికంగా తాగితే కడుపులో నొప్పి వచ్చే అవకాశం ఉంది.
శరీరంపై నేరుగా చర్మానికి రాసుకోకూడదు. ఎందుకంటే అలా చేయడం వల్ల పలు రకాలు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
టాబ్లెట్స్ వాడువారే నిమ్మకాయతో చేసే ఆహార పదార్థాలను, లెమన్ వాటర్ తాగేటప్పుడు వైద్యులను సంప్రదించడం మంచిది.