వేసవి తాపాన్ని తీర్చుకునేందుకు కోల్డ్ కాఫీ ఎక్కువగా తాగుతున్నారా?

వేసవిలో భానుడి భగభగలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. అయితే వేడి తాపాన్ని తీర్చుకునేందుకు చల్లటి పానియాలను తాగాలనుకుంటారు.
అయితే ఎక్కువగా కోల్డ్ కాఫీ తాగుతుంటారు. అలా చేయడం వల్ల ప్రమాదకర సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కోల్డ్ కాఫీ ని అధికంగా సేవించడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.
దీంతో కొంత మందికి డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
అలాగే కాఫీలోని కెఫిన్ నిద్ర పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఇది పలు రకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
ప్రతి రోజు కోల్డ్ కాఫీ తాగితే అలసట, ఆందోళనకు గురవుతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
దీనిని నిత్యం శరీరంలోకి పంపడం వల్ల తలనొప్పి, మైకం వంటివి ఎదురవుతాయి.
కోల్డ్ కాఫీ తో రోగనిరోధక శక్తి తగ్గిపోయే ప్రమాదం పొంచి ఉందని వైద్యులు చెబుతున్నారు.