ప్రతి రోజూ గ్రీన్ టీ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

గ్రీన్ టీ తాగితే కేవలం బరువు మాత్రమే తగ్గుతారని కొందరి భావన. కానీ గ్రీన్ టీతో ఎన్నో రకాల ప్రయోజనాలున్నాయి.
ఈ టీనీ రోజూ తాగడం వల్ల అనేక రోగాలను దూరం చేసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
యాంటీ యాక్సిడెంట్స్ అధికంగా ఉండే గ్రీన్ టీ రొమ్ము క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్, ప్రోస్టేజ్ క్యాన్సర్ల వంటి పెద్ద ప్రమాదాలను తగ్గించడంతో మేలు చేస్తుంది.
రక్తంలో షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేయడంతో పాటు గుండె జబ్బులను దరి చేరనివ్వదు.
గ్రీన్ టీలో ఉండే కెఫిన్ కంటెంట్ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.
బీపీని అదుపులో ఉంచుతుంది. మతిమరుపును తగ్గిస్తుంది.
శరీరంలోని అదనపు కొవ్వును తగ్గించడంతో పాటు.. కాలేయం ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతో సహాయపడుతుంది.
ది జర్నల్ ఆఫ్ న్యూట్రిషనల్ బయోకెమిస్టీలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం గ్రీన్ టీ కొవ్వు కాలేయ వ్యాధి బారిన పడే ప్రమాదాన్ని 75 % తగ్గిస్తుంది.