వేసవి వేడిని తట్టుకోలేక చల్లటి బీర్ తాగుతున్నారా?

ప్రస్తుతం వేసవి కావడంతో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. వేడికి తట్టుకోలేక చాలా మంది ఇంట్లోనే ఉంటున్నారు. అలాంటి టైమ్‌లో చల్లటి బీర్ తాగాలనుకుంటారు.
అయితే ఎండ వేడిని తట్టుకునేందుకు సాయంత్రం చల్లగా బీర్ తాగుతారు. అయితే దీనిని రోజూ తాగడం వల్ల పలు అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రపంచం మొత్తంలో టీ, కాఫీ తర్వాత బీర్‌కు మూడవ అత్యంత ప్రజాదరణ పొందిన పానీయం.
బీర్‌లో ఉండే కార్బోహైడ్రెట్లు ఉండి మదుమేహ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా గ్లూకోజ్‌ను కడుపులో కొవ్వుగా నిల్వ చేస్తుంది.
ఒక సిసా బీర్‌లో దాదాపు 200 కాలరీలు కలిగి ఉంటాయి. కాబట్టి దీనిని తాగితే తొందరగా బరువు పెరుగుతారు.
గ్లూటెన్ సమస్య ఉన్నవారు బీర్ తాగడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలను కలిగిస్తుంది. అలాగే కళ్లకు చికాకును పెంచుతాయి.
ప్రతి రోజూ బీర్ తాగితే అధిక రక్తపోటు, గుండె జబ్బులు వస్తాయి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి.
ఇందులో ఆక్సీకరణ ఉండటం వల్ల ఒత్తిడిని పెంచే సమ్మేళనాలు కలిగి ఉంటాయి. దాని వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.